ఉపరాష్ట్రపతి వెంకయ్య కు ఊహించని ప్రశ్నవేసిన వైసీపీ ఎమ్మెల్యే..!

ఉపరాష్ట్రపతి వెంకయ్య కు ఊహించని ప్రశ్నవేసిన వైసీపీ ఎమ్మెల్యే..!

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ పై మరియు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పై దారుణంగా విమర్శలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో అవినీతి ఏరులైపారుతోంది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అని తెగ ఉపన్యాసాలు ఇచ్చే పవన్ కళ్యాణ్ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీని ఎందుకు నిలదీయడంలేదని అన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీపై మరియు ఆ పార్టీ చేస్తున్న అవినీతిపై మొట్ట మొదటి నుండి పోరాడుతున్న జగన్ పై పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం దారుణమని పేర్కొన్నారు.
 
అంతేకాకుండా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీరు సరిగా లేదన్నారు. ఇన్నాళ్లు మౌనం వహించిన వెంకయ్య ఫిరాయింపుదారులపై ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుతో ఉన్న ఫిరాయింపుదారులను ఓడించండి అని వెంకయ్య చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల సొమ్మును తెలంగాణ ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారని సురేష్‌ మండిపడ్డారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీ ప్రజలు అధికార పార్టీ టీడీపీ చేస్తున్న అవినీతిని సహించలేక ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు చంద్రబాబుని గద్దె దించుతామని అంటున్నారని వ్యాఖ్యానించారు సురేష్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top