జగన్ పై హత్యకు పాల్పడిన శ్రీనివాస్ నీ కాపాడాలని చూస్తున్న టిడిపి..?

By Xappie Desk, December 07, 2018 10:42 IST

జగన్ పై హత్యకు పాల్పడిన శ్రీనివాస్ నీ కాపాడాలని చూస్తున్న టిడిపి..?

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై అక్టోబర్ నెల 25 వ తారీఖున విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించింది. పాదయాత్ర లో జగన్ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ నేతలు ఈ హత్య యత్నం జరిపించారని వైసీపీ నేతలు అప్పట్లో కామెంట్లు చేశారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ఈ దాడి కేసు హై కోర్టు పరిధిలో ఉన్న క్రమంలో జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తి శ్రీనివాసుని తెర వెనుక నుండి తెలుగుదేశం పార్టీ కాపాడుతున్నట్లు కామెంట్లు వినబడుతున్నాయి. ఇదే క్రమంలో వైసిపి పార్టీకి చెందిన న్యాయవాది ఇదే కామెంట్ చేశారు ఇటీవల.
 
ఎందుకంటే ఒక పక్క ఈ కేసు మీద కేంద్రంతో దర్యాప్తు చెయ్యించకుండా ఇక్కడి పోలీసు యంత్రాంగం చేతుల్లోనే నొక్కి ఉంచేసిన పోలీసులే ఇప్పుడు టీడీపీ తో కలిసి హై కోర్టు ఇచ్చిన తీర్పునే తుంగలోకి తొక్కేయాలని చూస్తున్నారా అని హై కోర్టు అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. నిజానికి దాడికి పాల్పడినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు మీద సెక్షన్ 3A కింద కేసు నమోదు ఎందుకు నమోదు చెయ్యలేదు అని ప్రశ్నించగా, అడ్వొకేట్ జనరల్ మాత్రం అది అతనికి చాలా పెద్ద శిక్ష అవుతుందని, అందుకే అలా కేసు నమోదు చెయ్యలేదు అని చెప్పారు.
 
ఈ క్రమంలో కోర్టు ముద్దాయికి ఏ శిక్ష పడితే మీకేంటి, అతని మీద పెట్టాల్సిన సెక్షన్ నమోదు చెయ్యకుండా తక్కువ శిక్ష పడే సెక్షన్ పెట్టి అతనికి పడే శిక్షను మీరు తగ్గించాలని చూస్తున్నారా అని సూటి ప్రశ్న వేశారు. దీనితో ఇంకా అనుమానాలు లేవనెత్తాయని జగన్ తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు. ఎన్నికలలోపు శ్రీనివాసుని కాపాడాలని తెర వెనుక నుండి తెలుగుదేశం పార్టీ నేతలు నడిపిస్తున్నారని తక్కువ శిక్ష పడి బయటకు తీసుకు వచ్చేలా చూస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top