బాబు భవిష్యత్తు ఏంటో ...అద్భుత విశ్లేషణ..!

బాబు భవిష్యత్తు ఏంటో ...అద్భుత విశ్లేషణ..!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రచారం చేయడంతో ఈ రోజు ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తెల్లవారుజామునే పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. ఇదిలావుండగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే రెండో అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బాబు భవిష్యత్తు ఏంటని చాలా ప్రశ్నలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలలో ఏర్పడుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి ఏమోగానీ బాబు కి మాత్రం ఇది భవిష్యత్తు తెలియజేసే ఎన్నికలు అని చాలా మంది రాజకీయ నేతలు అంటున్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా చంద్రబాబుపై నమోదైన ఓటుకు నోటు కేసు బయటకు తీయడం ఖాయమని అంటున్నారు.
 
ఇదే క్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఈ ఎన్నికలలో మహాకూటమికి ఆర్థికంగా వెనుక నుండి చంద్రబాబే నడిపిస్తున్నారు అన్న కామెంట్లు కూడా రావడంతో తమ పార్టీ అధికారంలోకి రాకుండా ఎన్నికల ముందు చంద్రబాబు వ్యవహరించిన క్రమంలో టిఆర్ఎస్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బాబు భవిష్యత్తు రాజకీయ జీవితం కనుమరుగైనట్లే అని చాలామంది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. దీంతో ఆంధ్ర రాష్ట్రాన్ని విభజనతో నష్టం చేకూర్చిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన టిడిపి...ఒకవేళ తెలంగాణలో ఓడిపోయిన క్రమంలో...కచ్చితంగా ఏపీలో వైసిపి గ్రాఫ్ పెరగడం ఖాయమని...ఇక జగన్ వార్ వన్ సైడ్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా చంద్రబాబు భవిష్యత్ తేల్చేది ప్రస్తుతం జరుగుతున్న రెండో అసెంబ్లీ తెలంగాణ ఎన్నికలు అని అంటున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top