పిట్టకథలు అబద్ధాలు చెప్పాలంటే చంద్రబాబు తర్వాతే : జగన్

పిట్టకథలు అబద్ధాలు చెప్పాలంటే చంద్రబాబు తర్వాతే : జగన్

ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల తెలంగాణలో పర్యటించి ప్రసంగించిన చంద్రబాబు పై ఆయన వ్యవహరించిన తీరుపై దారుణమైన విమర్శలు చేశారు జగన్. ముఖ్యంగా హైదరాబాద్ నగరం గురించి మరియు దాని అభివృద్ధి గురించి టీడీపీ అధినేత చంద్రబాబు పిట్టలదొర కథలు చెప్పారని మండిపడ్డారు. వైయస్ హయాంలో హైదరాబాద్ నగరం చాలా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.
 
అంతేకాకుండా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను నిర్మించి ప్రారంభించింది ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. 2005 మార్చిలో శంషాబాద్ విమానాశ్రయం పనులు ప్రారంభించి 2008లో ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించింది వైఎస్ కాదా అంటూ నిలదీశారు. 2005లో డిసెంబర్ లో ఔటర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించి ఆయన హయాంలోనే పూర్తి చేసింది వాస్తవం కాదా అన్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఐటీ వరకు ఔటర్ రింగ్ రోడ్డు వెయ్యడం వల్లే ఐటీ రంగం ఉరుకులు పరగులు పెట్టిందని చెప్పుకొచ్చారు.
 
చంద్రబాబు నాయుడు హయాంలో ఐటీ రంగం వృద్ధి రేటు 5శాతం ఉంటే అదే వృద్ధిరేటు వైఎస్ హయాంలో 14శాతానికి చేరుకుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం 5వ స్థానంలో ఉంటే దాన్ని 3వ స్థానంలోకి తీసుకెళ్లింది రాజశేఖర్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హయాంలో 909 కంపెనీలు ఉంటే వైఎస్ హయాంలో 1500 కంపెనీలు వచ్చాయని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో 85వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తుంటే అదే వైఎస్ హయాంలో 2లక్షల 64వేల 754 మంది పనిచేశారని చెప్పారు. ఏదైనా పిట్టకథలు చెప్పాలన్న అబద్ధాలు చెప్పాలన్న చంద్రబాబు తర్వాతే అని అన్నట్లుగా జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top