ఏపీ లో ఉన్న నిరుద్యోగులకు మరో శుభవార్త తెలియజేసిన చంద్రబాబు ప్రభుత్వం..!

By Xappie Desk, December 07, 2018 15:43 IST

ఏపీ లో ఉన్న నిరుద్యోగులకు మరో శుభవార్త తెలియజేసిన చంద్రబాబు ప్రభుత్వం..!

ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తూ ఆదుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా మరొకసారి కొత్త నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ భృతి తీసుకుంటున్న యువతకు నిరుద్యోగ భృతి తో పాటు ఉపాధిని చేకూర్చే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు..ఈ సందర్భంగా నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలి అని మంత్రి కొల్లు రవీంద్ర అధికారికంగా ప్రకటించారు.
 
ఇటీవల రాజధాని అమరావతి లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కొల్లు రవీంద్ర ...ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద రూ.4లక్షలకు పైగా అర్హులకు ప్రతి నెలా రూ.వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల 74వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
 
నిరుద్యోగ భృతి అందుకుంటున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీ నుంచి 555 కేంద్రాల్లో సిల్క్ డెవలప్ మెంట్ శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. దీని కోసం రూ.24 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించారు. శిక్షణపొందాలని అనుకుంటున్న అర్హులైన ప్రతి ఒక్కరూ యువ నేస్తం పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సదరు నిరుద్యోగికి ఏ విభాగంలో అయితే ఎక్కువ నేర్పరితనం ఉంటుందో అందులో శిక్షణ ఇస్తారని వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర . తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమానికి అతికొద్ది సమయంలోనే ఆన్ లైన్ నుండి అనేక దరఖాస్తులు రావడం విశేషం.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top