ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో ఆ జిల్లాలో మారిపోయిన రాజకీయ సమీకరణాలు..!

ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో ఆ జిల్లాలో మారిపోయిన రాజకీయ సమీకరణాలు..!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి..ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఈ క్రమంలో రంగారెడ్డి లో ఎక్కువగా మహా కూటమి హవా కొనసాగుతున్నట్లు ఎన్నికల ముందు జరిగిన సర్వేలలో తేలింది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ప్రకటించిన ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ హవా స్పష్టంగా కనబడింది.
 
అయితే ఎప్పుడైతే తన స్వార్ధ రాజకీయాలకోసం అనేక మంది ప్రాణాలు త్యాగాల తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తన స్వార్ధ రాజకీయాలకోసం అధికారం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్య బద్ధమైన అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎప్పుడు వెళ్లారో..టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కెసిఆర్ వ్యవహరించిన తీరుకు వెంటనే పార్టీకి మరియు పదవికి రాజీనామా చేసి బయటకు రావడంతో రంగారెడ్డి జిల్లాలో ఉన్న రాజకీయ లెక్కలు మొత్తం తారుమారు అయిపోయాయి.
 
తెలంగాణ రాష్ట్రం కోసం నిస్వార్ధంగా జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో పోరాడిన కలలు కన్న వ్యక్తులలో ఒకరు విశ్వేశ్వర్ రెడ్డి. ఈ క్రమంలో ఇంత హుందా కలిగిన వ్యక్తి ...టిఆర్ఎస్ పార్టీలో నుండి బయటకు రావడంతో ప్రజలు ఒక్కసారిగా తమ ఆలోచనలను మార్చుకోవడం తో రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఓటర్ల దృష్టి ఒక్కసారిగా మహా కూటమి వైపు వెళ్లడంతో ...ఎన్నికల ముందు సమీకరణాలు మారిపోయాయి. మొత్తంమీద రంగారెడ్డి జిల్లాలో విశ్వేశ్వర్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగిపోయింది అన్ని విశ్లేషిస్తున్నారు రాజకీయవిశ్లేషకులు
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top