లగడపాటికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ అధికారి ప్రకటన..!

By Xappie Desk, December 08, 2018 11:02 IST

లగడపాటికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ అధికారి ప్రకటన..!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చించుకుంటున్నారు. డిసెంబర్ 11న వెలువడనున్న ఫలితాలు క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పందెం రాయుళ్లు భారీ స్థాయిలో బెట్టింగులు వేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగితే మహాకూటమి అధికారంలోకి రావటం ఖాయమని తేల్చిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలియజేశారు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు గతసారి కన్నా ఓటింగ్ శాతం కొంత తగ్గింది.కిందటిసారి 69.5శాతం ఓట్లు పోల్ అయితే ఈసారి 69.1 శాతం ఓట్లే పోల్ అయినట్లు ఎన్నికల ముఖ్య అదికారి రజత్ కుమార్ రాత్రి పొద్దు పోయిన తర్వాత ప్రకటించారు.
 
ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో 91.27 శాతం ఓటింగ్‌ నమోదయింది. అత్యల్ప పోలింగ్‌ రాజధాని పరిధిలోని మలక్‌పేటలో జరిగింది. ఇక్కడ కేవలం 40 శాతం మంది మాత్రమే ఓటేశారు. మొత్తంమీద లగడపాటి వ్యాఖ్యలు బట్టి పోలింగ్ ఓటింగ్ శాతం గతంకంటే తగ్గడంతో ఈసారి కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు.ఇదే క్రమంలో అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా టిఆర్ఎస్ పార్టీ హవా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో మల్లె టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమాగా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ నేతలు.Top