ఎన్నికలు అయిపోయాక ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..!

By Xappie Desk, December 08, 2018 11:13 IST

ఎన్నికలు అయిపోయాక ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యాక కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కేసిఆర్ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని..తెలంగాణ ప్రజలు కోరుకున్న పాలన కేసీఆర్ అందించలేదని..ఈ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కేసిఆర్ కి తగిన విధంగా బుద్ధి చెప్పారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చాక కెసిఆర్ ప్రతిపక్షాల సూచనలు, సలహాలను ఏమాత్రం పట్టించుకోలేదని, తనకి ఇష్టమొచ్చినట్లు పాలించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని రేవంత్‌ మండిపడ్డారు.
 
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి మంత్రివర్గ సహచరుల వరకు అపనమ్మకం, అసహనంతో గందరగోళ పరిస్థితుల నడుమ పాలన కొనసాగిందని దుయ్యబట్టారు.మోసమే పునాది, పెట్టుబడిగా కేసీఆర్‌ 52 నెలల పాలన సాగిందని రేవంత్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. డిసెంబర్ 11 తరువాత తెరాస ఇక మనకి కనిపించదని, కేసీఆర్‌కు మిగిలేది పార్టీ ఫిరాయింపుదారులు, కొద్ది మంది కిరాయి నాయకులు, పిడికెడు కాంట్రాక్టర్లు మాత్రమేనని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
 
కల్లబొల్లి మాటలు అహంకార పూరిత పరిపాలన వంటివి చూసిన తెలంగాణ ప్రజలు కెసిఆర్ కి తగిన విధంగా బుద్ధి చెప్పారని 11 వ తారీకున అది తెలుస్తుందని రేవంత్ రెడ్డి దారుణంగా విమర్శించారు. మరి 11 వ తారీకున ఎటువంటి ఫలితాలు ఇచ్చారో తెలంగాణ ప్రజలు.Top