పొలిటికల్ గా డౌన్ ఫాల్ లో పడిపోయిన చంద్రబాబు..!

By Xappie Desk, December 08, 2018 11:15 IST

పొలిటికల్ గా డౌన్ ఫాల్ లో పడిపోయిన చంద్రబాబు..!

రాజకీయాలలో చంద్రబాబు రోజురోజుకి డౌన్ ఫాల్ లో పడిపోతున్నట్లు అభద్రతా భావంతో పరిపాలన చేస్తున్నట్లు ఆయన అనుసరిస్తున్న వైఖరితో అందరికీ అర్థం అయిపోతుంది. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా రాష్ట్రంలో ఉన్న డిఎస్సీ అభ్యర్థుల పోస్టుల భర్తీ విషయంలో పూర్తి చేయాలని అభ్యర్థులు ఆందోళనలో నిరసనలు తెలియజేయడంతో వెంటనే ప్రసంగిస్తున్న చంద్రబాబు తన ప్రసంగం అంశాన్ని పక్కనపెట్టి..డిఎస్సీ అభ్యర్థుల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
ఈ క్రమంలో మైక్ కట్ చేసిన చంద్రబాబు..వెంటనే మైక్ అందుకుని మీకు బుద్దుందా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, క్రమశిక్షణ లేని జీవితం మీకు వృథా, ప్రభుత్వం మీ ఒక్కరి కోసం పనిచేయడానికి సిద్ధంగా లేదు అంటూ చిందులు తొక్కారు. న్యాయం చేస్తాడని, ఏదైనా హామీ ఇస్తాడని అక్కడకు వచ్చి నిరసన ప్రయత్నం చేసిన యువత మొత్తం బాబు మాటలకు, పోలీసుల చర్యలకు అవాక్కై మీడియా ముందు బాబు వస్తే జాబ్ అన్నారు, ఆయన కొడుక్కి మాత్రం జాబ్ వచ్చింది, రోజుకి ఒక పూట తిని రెండు పూటలా పస్తులుంటున్నాం అంటూ తమ ఆవేదనను వెళ్లగక్కారు.
 
మొత్తం మీద చంద్రబాబు గ్రాఫ్ పరిశీలిస్తే ఏపీలో చాలా దారుణంగా ఉందని అర్థమవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా నిరసనలు ఎక్కువవుతున్న క్రమంలో పోలీసుల చేత అభ్యర్థులను లాక్కెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు.Top