మీ శిష్యుడే ముఖ్యమంత్రి బాబు కి సోనియా అర్జెంట్ ఫోన్..?

By Xappie Desk, December 08, 2018 11:22 IST

మీ శిష్యుడే ముఖ్యమంత్రి బాబు కి సోనియా అర్జెంట్ ఫోన్..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఏర్పడిన మహాకూటమిని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలో అడుగుపెట్టి కెసిఆర్ కి దీటైన రాజకీయ చాణిక్య నిర్ణయాలు తీసుకుని టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వారం ముందు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు రాక ముందు మహాకూటమి గ్రాఫ్ ఒకలా ఉంటే చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యాక మహా కూటమి పరిస్థితి మరోలా ఉంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.
 
ఎప్పుడైతే మహా కూటమిని చంద్రబాబు ముందుండి నడిపించారు చాలా సర్వేలలో ఫలితాలు తారుమారు అయిపోయాయి. ఒకానొక క్రమంలో కెసిఆర్ కూడా ఓడిపోతారని చాలా సర్వేలలో తేలింది. ఏది ఏమైనా ఎన్నికలు అయిపోయాక దేశంలోనే ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి తెలంగాణ ఎన్నికల విషయమై తన ఫలితాలు వెల్లడించాక మహా కూటమికి చెందిన నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
 
ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి లగడపాటి ఫలితాలు తెలుసుకుని చంద్రబాబుకి ఫోన్ చేసినట్లు అభినందనలు తెలిపినట్లు...మహా కూటమిని ముందుండి నడిపించిన అందుకు..మరియు తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి నందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు...ఈ నేపథ్యంలో అధికారంలోకి వస్తే మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ శిష్యుడు రేవంత్ రెడ్డి ని ప్రతిపాదించండి అని సోనియా చంద్రబాబుతో అన్నట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్ వినపడుతుంది. మొత్తంమీద లగడపాటి సర్వే బయటకు రావడంతో సోనియా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకసారి లగడపాటి సర్వే వివరాలు తెలుసుకుందాం .
 
తెలంగాణ – (119)
టీఆర్ఎస్ 25 – 45
ప్రజాకూటమి 55 – 75
బీజేపీ 5 – 7
ఎంఐఎం – 6-7
ఇత‌రులు – 5 – 9Top