ఏపీలో టీడీపీ కంచుకోట నియోజకవర్గానికి షాక్..!

By Xappie Desk, December 08, 2018 12:49 IST

ఏపీలో టీడీపీ కంచుకోట నియోజకవర్గానికి షాక్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇటీవల చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వివిధ ప్రాంతాల నుండి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ లోకి వచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీ కంచుకోట హిందూపురం నియోజకవర్గంలో చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అబ్దుల్ ఘనీ పార్టీ మరి వైయస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. 30 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ.. పార్టీకి కృషి చేసినా.. తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న కారణంతో పార్టీని వీడినట్లు అబ్దుల్ ఘనీ ఈ సందర్భంగా తెలిపారు.నాలుగేళ్లుగా మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పంచిన ఘనత వైఎస్ఆర్ దేనని అన్నారు. రాష్ట్రంలో మొత్తం ముస్లిం వర్గం వైసీపీ పార్టీ వెనుక ఉందని కచ్చితంగా 2019 ఎన్నికల్లో జగన్ ని ముఖ్యమంత్రి చేసేది ఆంధ్ర ప్రజలని..టీడీపీ చేసిన మోసాలతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు వైసిపి పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి రెడీగా ఉన్నారని అబ్దుల్ ఘనీ తెలిపారు.Top