ఫలితాలు వచ్చాక రెండు పత్రికలకు మూడింది అంటున్న కేటీఆర్..?

By Xappie Desk, December 08, 2018 13:03 IST

ఫలితాలు వచ్చాక రెండు పత్రికలకు మూడింది అంటున్న కేటీఆర్..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పార్టీకి మద్దతుగా ఉన్న రెండు ప్రముఖ పత్రికలు రెండోసారి వచ్చిన అసెంబ్లీ ఎన్నికల విషయంలో అనూహ్యంగా టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తూ మహాకూటమికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంతో కంగు తిన్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్. గత నాలుగు సంవత్సరాల తమతో కలిసి పనిచేసిన ఆ రెండు పత్రికలు నెలరోజుల క్రితం ప్లేటు మార్చేసి టిఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని కేటీఆర్ పోలింగ్కు ముందు రోజు కామెంట్లు చేశారు. అధికారంలో ఉన్నంత వరకు అంటకాగిన ఆ ఇద్దరు మీడియా అధిపతులు సడన్ గా కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు. టీఆర్ ఎస్ ఓడిపోతుందంటూ తమ మీడియాల్లో విస్తృత ప్రచారం చేశారు. మీడియా మేనేజ్ మెంట్ లో కింగ్ అయిన చంద్రబాబు అండదండలతో తమ పత్రికలు - మీడియాలో కాంగ్రెస్ ప్రకటనలు హోరెత్తించారు. అంటూ కేటీఆర్ ఆ రెండు పత్రికలపై ఆ పత్రిక గజపతులపై విమర్శలు చేశారు. 11 వ తారీకున ఫలితాలు వెలువడ్డాక ఆ రెండు పత్రికలకు తగిన విధంగా బుద్ధి చెబుతామని కేటీఆర్ పేర్కొన్నారు.ఇష్టమొచ్చిన రాతలతో టిఆర్ఎస్ పార్టీపై విష ప్రచారం చేశారని..ఇంత దారుణంగా ఆ రెండు పత్రికలు వ్యవహరిస్తాయని అనుకోలేదని ఫలితాలు వచ్చాక తగిన విధంగా బుద్ధి చెబుతామని కేటీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.Top