కొత్త కొత్త నిర్ణయాలతో చెలరేగిపోతున్న కేసీఆర్..!

By Xappie Desk, December 15, 2018 13:12 IST

కొత్త కొత్త నిర్ణయాలతో చెలరేగిపోతున్న కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశారు పార్టీ పగ్గాలను తన తనయుడు కేటిఆర్ కి అప్పజెప్పి తెలంగాణ రాజకీయాలలో హిట్ పుట్టించారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం లో పంచాయతీ మరియు లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో పార్టీ విజయతీరాలకు కేటీఆర్ గనుక గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వ్యవహరించినట్లు టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపిస్తే మాత్రం కెసిఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని కేటీఆర్ చేతిలో పెట్టాలని భావిస్తున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో కనపడుతున్న టాక్. మరో పక్క టిఆర్ఎస్ పార్టీ నాయకుడైన హరీష్ రావుకు త్వరలో ఏర్పడనున్న కొత్త మంత్రివర్గంలో కీరోల్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
 
కొడుకు కేటీఆర్ కు అందలం ఇచ్చి బలమైన - సమర్ధుడైన ట్రబుల్ షూటర్ హరీష్ రావు కు అన్యాయం జరిగిందనే వాదనలకు ఆస్కారం లేకుండా మంత్రివర్గంలో కీలక శాఖలు - అవసరమైతే ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అల్లుడిని కూడా ఎక్కడా తగ్గకుండా చూడాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. మరి అదే విధంగా గతంలో మంత్రివర్గంలో మహిళలకు మరియు దళితులకు మంత్రివర్గంలో చోటు కల్పించిన నేపథ్యంలో కెసిఆర్ కొత్తగా ఏర్పడబోతున్న మంత్రివర్గంలో వారికి కూడా సరైన స్థానాలు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.Top