తెలంగాణ ఎన్నికల గురించి బాబు నోరు మెదపరేం అంటున్న ప్రజలు..!

By Xappie Desk, December 15, 2018 13:16 IST

తెలంగాణ ఎన్నికల గురించి బాబు నోరు మెదపరేం అంటున్న ప్రజలు..!

రాజకీయాలలో చంద్రబాబు గురించి చాలామంది అనేక రీతులుగా కామెంట్లు చేస్తుంటారు. తన గురించి తాను గొప్పలు చెప్పాలనుకున్న మరియు ప్రజలకు అబద్ధాలు చెప్పాలన్న చంద్రబాబు తర్వాతే అని చాలామంది తెలుగు రాజకీయ నేతలు పేర్కొంటారు. ఈ క్రమంలో ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి పార్టీ ఘోరంగా పరాజయం పాలవడంతో బిజెపి పార్టీ ఓటమికి కారణం నేనే అంటూ ఇటీవల చంద్రబాబు కామెంట్లు చేశారు. వేరే చోట్ల జరిగిన ఎన్నికల్లో కనీసం ప్రచారానికి వెళ్లని చంద్రబాబు బీజేపీ ఓటమికి కారణం నేనే అంటూ చేస్తున్న కామెంట్లపై చాలామంది రాజకీయ నేతలు నవ్వుకుంటున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన విశాఖ జిల్లా తగరపువలసలో జరిగిన సభలో మాట్లాడుతూ "నా వల్లే ఆ మూడు రాష్ట్రాలలో బీజేపీ చిత్తుగా ఓడింది. ఆ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ కృషి ఎంతో ఉంది" అని అన్నారు. తలాతోకా లేని ఈ వ్యాఖ్యలతో అక్కడి ప్రజలు నోళ్లువెళ్లబెట్టారు. అసలు బాబుకు ఆ మూడు ఎన్నికలకు సంబంధం ఏమిటో చంద్రబాబు నాయుడి ఎందుకిలా మాట్లాడుతున్నారో ఎవరికీ అర్దం కాలేదు. ఈ క్రమంలో ఆ సభలో ఉన్న కొంత మంది ప్రజలు మరి తెలంగాణ రాజకీయాల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని తమలో తాము కామెంట్లు చేశారు. అంతే కాకుండా ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ నందమూరి హరికృష్ణ చనిపోయిన సమయంలో పొత్తు గురించి మాట్లాడి నీచ రాజకీయాలకు తెగబడ్డారు అని చంద్రబాబు పై చేసిన విమర్శలకు తాజాగా జరిగిన సభలో చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఆరోజు తాను పొత్తులు గురించి మాట్లాడలేదని మోదీ ప్రభుత్వం పై పోరాటానికి చేతులు కలపమని అడిగానని అన్నారు.Top