నాలుగు సంవత్సరాల్లో మోడీ చేసిన ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు..!

By Xappie Desk, December 15, 2018 13:16 IST

నాలుగు సంవత్సరాల్లో మోడీ చేసిన ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు..!

2014 ఎన్నికల సమయంలో విదేశాలలో దాగి ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి దేశంలో పంచుతాను అని చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ఇప్పటిదాకా నల్లధనం విషయమై మోడీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా అధికారంలోకి వచ్చిన మోడీ అనేక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేసి విదేశీ పర్యటనలు చేస్తూ కొత్త కలరింగ్ ఇచ్చిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు.

ఈ నేపథ్యంలో మోడీ ప్రధాని అయ్యాక నాలుగు సంవత్సరాలు ఏం చేశారు అన్న దానిపై తాజాగా సంచలనం సృష్టించే ఒక వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో పథకాల ప్రచారానికి చేసిన ఖర్చు మొత్తం రూ.7200 కోట్లు అని తేలింది. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.

ప్రధాని అయిన తర్వాత మోడీ 84 విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఇందుకోసం సుమారుగా 280 మిలియన్ డాలర్లు (రూ.2000 కోట్లు) ఖర్చయ్యాయి. ఇక మోడీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పలు పథకాల ప్రచార - ప్రసార కార్యక్రమాల కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 720 మిలియన్ డాలర్లు (రూ.5200 కోట్లు) ఖర్చు చేసిందని పార్లమెంటు సమావేశాల సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వివరించింది. దీంతో ఈ ఖర్చు మొత్తం తెలుసుకున్న విపక్ష పార్టీలు మోడీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.Top