నారా లోకేష్ గురించి సంచలన వార్త బయటపెట్టిన లక్ష్మి పార్వతి..!

నారా లోకేష్ గురించి సంచలన వార్త బయటపెట్టిన లక్ష్మి పార్వతి..!

ఇటీవల నెల్లూరు జిల్లాలో పర్యటించిన నందమూరి లక్ష్మీపార్వతి ఏపీ సీఎం చంద్రబాబుపై మరియు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికలలో నందమూరి సుహాసిని ని పోటీ చేపించి నందమూరి కుటుంబ పరువును తీసేశారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు లక్ష్మీపార్వతి.

సుహాసిని ఓడిపోతుందని తెలిసినా కావాలని చంద్రబాబు కూకట్పల్లి నియోజకవర్గం లో పోటీ చేపించి నందమూరి వంశానికి ఉన్న పరువు ని తీసేశారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో తెలంగాణ ప్రజలను కొనాలని బాబు చూశాడని కానీ ఓటర్లు మాత్రం దిమ్మదిరిగేలా తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే తీర్పు ఇచ్చారో దాని కంటే డబల్ గా ఏపీ ప్రజలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం ఇటీవలే చంద్రబాబు అవినీతిపై విస్తుగొలిపే నిజాలు చెప్పాడని టీడీపీ నేతల అవినీతి బట్టబయలవుతోందన్నారు. సీఎం రమేష్ - సుజనాచౌదరిల బాగోతం బయటపడుతోందన్నారు. త్వరలోనే లోకేష్ బాబు బండారం వెలుగులోకి వస్తుందని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. చంద్రబాబు మీద చర్యలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top