పచ్చ మీడియా కళ్ళు బైర్లు గమ్మేలా డల్లాస్ కి పవన్ కోసం పోటెత్తిన ఎన్నారై లు - సూపర్ సక్సెస్ గర్జన !

By Xappie Desk, December 16, 2018 16:40 IST

పచ్చ మీడియా కళ్ళు బైర్లు గమ్మేలా డల్లాస్ కి పవన్ కోసం పోటెత్తిన ఎన్నారై లు - సూపర్ సక్సెస్ గర్జన !

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటన చాలా ఘనంగా సాగుతోంది. ఆంధ్ర రాష్ట్రం, మన దేశంలోనే కాకుండా ఖండాలు దాటి ఆయన ఖ్యాతి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరకు వ్యాపించింది. గత ఏడాది హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు ప్రసంగాన్ని ఇచ్చేందుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన యూఎస్ లోని ప్రవాస భారతీయులను కలిసేందుకు డల్లాస్ కి వెళ్ళారు.

అమెరికాలోని ప్రసిద్ధి చెందిన బ్లూమ్బర్గ్ బిజినెస్ వారు ఇంటర్వ్యూ తీసుకున్నారు. త్వరలోనే వారు ఇంటర్వ్యూని ప్రసారం చేయనున్నారు. అయితే వారు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను ఇండియన్ టామ్ క్రూజ్ అని కొనియాడడం విశేషం. దాని తర్వాత అతను ఎన్ఆర్ఐ డాక్టర్స్ ఫారం లో ప్రసంగించి, పార్టీ అభివృద్ధికి వారి నుండి విలువైన సూచనలు కూడా తీసుకున్నారని తెలిసింది. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏమిటంటే అక్కడ ఉంటున్న జనం పవన్ కళ్యాణ్ ను చూసేందుకు ఆంధ్ర రాష్ట్రంలో లాగా ఇక్కడ పోటీ పడి అతని రాకకై పడిగాపులు కాయడం. ఇక వాషింగ్టన్ మరియు టెక్సాస్ లో కొన్నిచోట్ల ముఖ్యమైన వ్యక్తులను కలిసిన పవన్ కళ్యాణ్ దాని తరువాత అక్కడున్న ప్రవాసాంధ్రులతో ఒక మీటింగ్ ను ఏర్పాటు చేశారు.

ప్రవాస గర్జన పేరుతో అక్కడ గుమిగూడిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన చాలా ముఖ్యమైన విషయాలు ప్రస్తావించారు. జనసేన పార్టీ ఏర్పాటుకు గల కారణాలను వారికి వివరించారు. రాష్ట్రాన్ని అవినీతిపరులు, దగాకోరులు ఎలుతున్నారని, అతను చిన్నప్పటి నుండి చూస్తున్న పరిస్థితి రానురాను మెరుగు పడకపోగా దిగజారుతోంది అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా చూడలేక ఆయన అందరితోపాటు మౌనాన్ని వహించలేక పార్టీ స్థాపించారని చెప్పుకొచ్చారు. సినిమాలు చేసుకుంటూ, దాదాపు 20 కోట్లు టాక్స్ కట్టే దానికన్నా ఇదే సబబుగా అనిపించిందని, సంపూర్ణమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తోందని అన్నారు. ఒక పార్టీ అధినేతగా తాను పార్లమెంట్ లోనికి ప్రవేశించినప్పుడు ఎందరో త్యాగాలతో ఏర్పడిన ఈ దేశం చదువురాని నియంతల చేతిలో సతమతమవడం చూసి ఓర్వలేక ఈ నిర్ణయం తీసుకున్నాను అని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా గత ఏడాది చిరంజీవి అక్కడ పర్యటించినప్పుడు డల్లాస్ లో ఒక ప్రముఖ సామాజిక వర్గానికి చెందిన వారు ఆయనని అక్కడ ప్రసంగించకుండా అడ్డుకున్నారు. దానిని ప్రముఖ ఆంధ్రజ్యోతి మరియు పచ్చ మీడియా అని చెప్పబడే ఛానెళ్లు మరీ ఆసక్తిగా లైవ్ ప్రసారం చేశాయి. అయితే ఇప్పుడు మన రాష్ట్రం నుండి మొట్టమొదటి వ్యక్తి బ్లూమ్ బర్గ్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కనీస విషయాన్ని ప్రజలకు తెలియజేయలేదు. ఇక అడుగడుగునా అతనికి లభిస్తున్న విశేష స్పందన చూసి వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయా అన్నట్లుగా అసలు దాని గురించే ప్రస్తావించలేదు సదరు టీ.వీ ఛానెళ్లు.

అక్కడికి వచ్చిన అశేష ప్రజాదరణ చూసి ఇక్కడ రాష్ట్రంలోని వారంతా విస్తుపోయారు. చివరగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి ఎలాంటి ఫండ్ కోసం రాలేదని, తరువాత సారి ఇక్కడికి వచ్చినప్పుడు జనసేన ను చాలా గొప్ప పరిస్థితిలో, బలమైన స్థితిలో చూస్తారని అన్నారు. “ప్రవాస గర్జన” చాలా గొప్పగా జరిగి అమెరికాలో కూడా సంపూర్ణ మద్దతు జనసేన సంపాదించింది అనే చెప్పాలి. ఆయన యూ.ఎస్ పర్యటన అంతా ఒక ఎత్తు అయితే, ఈ ప్రసంగం ఒక్కటి మరొక ఎత్తు. ఎటువంటి ప్రోద్బలం లేకుండా అక్కడికి తరలి వచ్చిన జనం వారి జనసేనానికి అపూర్వ నీరజనానిన్ని పట్టారు.Top