మోడీ ఏపీ పర్యటనకు సరైన స్కెచ్ వేసిన టిడిపి ఎంపి..!

By Xappie Desk, December 22, 2018 10:55 IST

మోడీ ఏపీ పర్యటనకు సరైన స్కెచ్ వేసిన టిడిపి ఎంపి..!

త్వరలో ఏపీలో ప్రచారానికి రాబోతున్న ప్రధాని మోడీకి దిమ్మతిరిగిపోయే విధంగా కౌంటర్లు నిరసనలు చేపట్టాలని ఆందోళనలు నిర్వహించాలని మంచి ప్లానింగ్ తో ఉన్నారు ఏపీ టిడిపి పార్టీకి సంబంధించిన వారు.

2014 ఎన్నికల సమయంలో ఆంధ్రాలో పర్యటించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తో జతకట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేని పోనీ హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చి ఆ తర్వాత విభజన తో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రం పట్ల కఠినంగా వ్యవహరించి మరింత కష్టాలు పెట్టిన మోడీ కి ఈ సరి వచ్చే ఎన్నికల్లలో కనీసం ఒక్క ఓటు కూడా బిజెపి కి రాష్ట్రం నుండి పడ్డ కూడదని పక్క స్కెచ్ మోడీ కి వేశారు టిడిపి వారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు మోడీపై నిప్పులు చెరిగారు.అమరావతిలో పర్యటించబోయే మోడీని నిలదీస్తాం అంటూ వ్యాఖ్యలు చేసారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసేందుకే ధర్మపోరాట దీక్షలు చేస్తున్నాం అని, శ్రీకాకుళంలో జరగబోయే ధర్మపోరాట దీక్ష రాబోయే ఎన్నికలకి దిశా నిర్దేశం చేయబోతుంది అని అన్నారు.

లక్ష మందితో శ్రీకాకుళంలో దీక్ష ఉండబోతుందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగానే కేంద్రాన్ని ఎదుర్కొంటాం అని అన్నారు, ఉత్తరాంధ్రకు జరుగుతున్నా అన్యాయంపైన పోరాడటం అని, విభజన చట్టం లోని హామీలన్నీ అమలు పరిచే వరకు ధర్మపోరాట దీక్షలు చేస్తాం అని అన్నారు.Top