ఎన్నికల ప్రచారానికి సంచలన ట్వీట్ చేసిన జనసేన అధినేత పవన్..!

ఎన్నికల ప్రచారానికి సంచలన ట్వీట్ చేసిన జనసేన అధినేత పవన్..!

త్వరలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అనేక హామీలు ఇస్తూ ప్రత్యర్థులపై విమర్శల దాడి చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి మరియు అధికార పార్టీ టిడిపి కి చుక్కలు చూపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేస్తు ట్వీట్ చేశారు. ఎన్నికల సమరానికి అందరు సిద్ధం కావాలని, పిలుపునిచ్చారు. ఆ ట్వీట్‌లో ‘సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చే సంక్రాంతి నుంచి.. జనసేన ఎన్నికల బరిలోకి దూకే క్రాంతి సమయం ఆరంభంకానుంది.

అందుకే జనవరి ఒకటో తేదీ నుండి క్షేత్రస్థాయి పర్యటనలతో పాటూ ఇక నాయకులందరికీ అనుక్షణం అమరావతిలో అందుబాటులో ఉంటాను. ఇప్పటికే జనసైనికుల కవాతు ధ్వనితో ఆంధ్ర రాష్ట్రం పరవళ్లు తొక్కుతోంది. రండి.. గెలిచి కొత్త తరాన్ని నిలబెడదాం.. నిలిచి కొత్త బావుటా ఎగరేద్దాం.. కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం’అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Tweet Link: Click hereTop