త్వరలో ఏపీ కి రాబోతున్న కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..!

By Xappie Desk, December 22, 2018 11:18 IST

త్వరలో ఏపీ కి రాబోతున్న కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..!

టిడిపి అధినేత చంద్రబాబు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక నిర్వహించిన మీడియా సమావేశంలో త్వరలో ఏపీలో పర్యటిస్తానని చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు చంద్రబాబు.

నేను తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినందుకు కేసీఆర్ ఆంధ్రాలో పర్యటించి నాకు గిఫ్ట్ ఇస్తానంటున్నారు..భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు ప్రచారం చేయవచ్చు ఆ హక్కు భారత రాజ్యాంగం అందరికీ ఇచ్చింది దీంతో కెసిఆర్ త్వరలో ఏపీ పర్యటనకు రానున్న నేపథ్యంలో నా శుభాకాంక్షలు అంటూ కెసిఆర్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే సంతోషమే అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా ఏపీ లో జరగబోయే ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ ఈవీఎంల బదులు బ్యాలెట్ పద్ధతిని అనుసరించారని కోరారు. మన ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవడం మన ప్రాథమిక హక్కు . ఇప్పటికి కూడా ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం రావడంలేదని, పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో ఎక్కువ ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఓట్లు వేసేప్పుడు అందరు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకి సూచించారు.Top