పాదయాత్ర లో కన్నీళ్లు పెట్టుకున్న జగన్..!

By Xappie Desk, December 22, 2018 11:29 IST

పాదయాత్ర లో కన్నీళ్లు పెట్టుకున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర చివరి దశకు చేరుకున్న క్రమంలో జనం నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాదయాత్ర చేస్తున్న జగన్ను చూడటానికి తొమ్మిది సంవత్సరాల అమ్మాయి జగన్ సెక్యూరిటీని దాటుకుని జ‌గ‌న్ వ‌ద్ద‌కు చేరుకుంది.

జ‌గ‌న్‌ను అంత ద‌గ్గ‌ర‌గా చూడ‌గానే బోరున ఏడ్చేసింది ల‌లిత‌. దీంతో జ‌గ‌న్ ఆ పాప‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఏమైంది త‌ల్లి అని ప్ర‌శ్నించ‌గా.. మిమ్మ‌ల్ని చూడ‌డానికి చాలా దూరం నుండి వ‌చ్చాన‌ని, అందుకోలేనోమో అని భ‌య‌మేసింద‌ని చెప్పింది. దీంతో ఆ అమ్మాయిని జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు తీసుకోగా, గ‌ట్టిగా హ‌త్తుకుని గుక్క‌పెట్టి మరీ ఏడ్చింది.

దీంతో ఆ ప్రాంత‌మంతా ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయింది. ఇక చిన్న‌గా ఆ అమ్మాయిని స‌ముదాయించినా.. భావోద్వేగానికి గురిఅవుడంతో ఆటైమ్‌లో జ‌గ‌న్ క‌ళ్ళు కూడా చ‌మ‌ర్చాయి. అయితే మరో పక్క జగన్ పాదయాత్రలో తలలు నిమరడం.. ముద్దులు పెట్టుకోవడం మంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలకు... ఈ ఒక్క చిన్న సంఘటన చాలు రాష్ట్రంలో చిన్న పాపకు కూడా జననేత జగన్ పై అభిమానం మరియు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఆరాటం కనబడుతుంది అని అనటానికి నిదర్శనం అని పేర్కొంటున్నారు వైసిపి పార్టీకి చెందినవారుTop