చంద్రబాబుకి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన తెలంగాణ టిడిపి కార్యకర్తలు..!

By Xappie Desk, December 22, 2018 11:45 IST

చంద్రబాబుకి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన తెలంగాణ టిడిపి కార్యకర్తలు..!

సాధారణంగా తెలుగు రాజకీయాలలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పై అనేక విధాలుగా కామెంట్లు చేస్తుంటారు ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నేతలు. ముఖ్యంగా చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచినంతగా మరి ఎవరు పొడవ లేదని కామెంట్లు చేస్తుంటారు.. తన స్వార్ధ రాజకీయాలకోసం నందమూరి కుటుంబ సభ్యులను చంద్రబాబు వాడినంతగా మరి ఎవరు వాడలేదని వ్యాఖ్యానిస్తుంటారు చంద్రబాబు ప్రత్యర్థులు. అలాంటి చంద్రబాబు కి తెలంగాణ రాష్ట్రంలో సొంత పార్టీ కార్యకర్తలు వెన్నుపోటు పొడిచినట్లు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో టాక్ వినపడుతుంది.

రీసెంట్‌గా తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో టిడిపి పోటీ చేసిన కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని ఉన్నవారు సైతం టీడీపీకి ఓటు వేయలేదట. ఈ విషయాన్ని విశ్లేషణ చేసుకున్న చంద్రబాబు షాకయ్యాడట. టిడిపి సీనియర్ నేతలందరితో ఇదే విషయంపై మీట్ అయి తన ఆవేదన వ్యక్తం చేశాడట. కనీసం టిడిపి కార్యకర్తలు కూడా పార్టీకి ఓటు వేయకుండా ఉండే పరిస్థితి ఎందుకు వస్తోందని నిలదీశాడట.

అయితే నాయకులు మాత్రం తప్పులన్నీ అధినేత చేసి మాపై అరిస్తే ఏం ఉపయోగం అని అంతర్గతంగా వాపోతున్నారు. మొత్తంమీద రాజకీయాలలో ఇతరులను వాడే చంద్రబాబుకి.. సొంత పార్టీ కార్యకర్తలు ఇలా షాక్ ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న విపక్ష పార్టీకి చెందిన నాయకులు ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకునే రోజులు అయిపోయాయని కామెంట్లు చేస్తున్నారు.Top