పుట్టినరోజు సందర్భంగా రాజకీయ నేతల నుండి విషెస్ అందుకున్న జగన్..!

By Xappie Desk, December 22, 2018 11:53 IST

పుట్టినరోజు సందర్భంగా రాజకీయ నేతల నుండి విషెస్ అందుకున్న జగన్..!

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా చాలా మంది ప్రముఖుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ మరియు రాజకీయ ప్రముఖులు జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మరియు నాయకులు తమ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా పలుచోట్ల కేక్ కట్ చేస్తూ తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నారు.
 
ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఎంపీ కవిత, పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అయితే జగన్ కు ‘పుట్టిన రోజు సందర్భంగా వైఎస్‌ జగన్‌గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ట్విట్‌ చేశారు. శుభాకాంక్షలు తెలిపినందకు ధన్యవాదాలు చంద్రబాబునాయుడుగారు అంటూ వైఎస్‌ జగన్‌ బదులిచ్చారు.

ఇదే క్రమంలో జగన్ పుట్టినరోజు వేడుకలు విదేశాలలో ఉన్న వైసిపి పార్టీకి చెందిన వారు కూడా ఘనంగా జరుపుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.Top