సంచలనం మీడియా రంగం లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రజిని..?

సంచలనం మీడియా రంగం లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రజిని..?

ఇప్పటికే పాలిటిక్స్ లో అడుగుపెట్టి సంచలనం సృష్టించారు ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్. తమిళ రాజకీయాలలో అడుగుపెట్టిన రజనీకాంత్ త్వరలో రాబోయే ఎన్నికల కోసం మరియు తన సిద్ధాంతాలు తన ఆలోచనలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం కోసం సొంత ఛానల్ ఏర్పాటు చేసుకునే ఆలోచనలో రజనీకాంత్ ఉన్నట్లు తమిళ రాజకీయాలలో టాక్ వినబడుతుంది.

ఈ మేరకు “మక్కల్ మంద్రం” అనే రాజకీయ పార్టీ ని స్థాపించిన రజిని త్వరలో తన రాజకీయాలకి అనుబంధంగా ఒక టీవీ ఛానల్ ని కూడా స్థాపించబోతున్నారని సమాచారం. రాబోవు ఎన్నికలలో తాను పోటీ చేయడంతో పాటు, అన్ని స్థానాల్లో కూడా తన పార్టీ అభ్యర్థులను నిలబెడతానని రజిని ప్రకటించారు కూడా. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రజిని త్వరలోనే ఈ కార్యక్రమం మొదలు పెట్టే పనిలో ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలో త్వరలోనే రజనీకాంత్‌ పేరు మీద ఓ టీవీ చానెల్‌ను కూడా ప్రారంభించబోతున్నారనే విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రజనీ టీవీ పేరుతో ఓ ట్రేడ్‌ మార్క్‌ను కూడా రిజిస్టర్‌ చేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మరోపక్క అధికారికంగా ఈ వార్త ఎక్కడా కూడా బయటకు రాలేదు.



Top