జనసేనపై కుట్రలు చేస్తుంది ఎవరు ??

జనసేనపై కుట్రలు చేస్తుంది ఎవరు ??

అవినీతితో కూరుకుపోయి, కులాల మధ్య చిచ్చు రగుల్చుతూ సాగుతున్న రాజకీయాలను సమూల ప్రక్షాళనే ధ్యేయంగా, సరికొత్త ఆలోచనా విధానంతో, ఉన్నత అశయాలతో పుట్టింది జనసేన. ఇక్కడ కుల ప్రస్తావన ఉండదు, ప్రాంతీయ అసమానతలు ఉండవు, వ్యక్తిగత స్వార్థాలు ఉండవు. అందరూ పనిచేసేది జనసేన ప్రజా ప్రభుత్వ స్థాపన కోసం, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం.

మొన్నటి వరకు జనసేనానిపై విషం చిమ్మడం ద్వారా జనసైనికుల్లో, ప్రజల్లోకి జనసేన వెళ్లకుండా చేయడానికి కుతంత్రాలు పన్నినప్పటికీ జనసేనాని మీడియాపై యుద్ధం ప్రకటించడం ద్వారా ఆ ప్రయత్నం నీరు కారడంతో ఇప్పుడు పార్టీలోని ఇతర నాయకుల మధ్య స్పర్ధలు తీసుకురావడం, నాయకుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకంగా చిత్రీకరించడం ద్వారా పార్టీ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

జనసేనాని ఒక సుదీర్ఘమైన సామాజిక మార్పు సాధించే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు, ఈ ప్రయత్నంలో ఆయన ఆశయాలను సాధించేలా ఆయనకు బలాన్ని ఇచ్చే అనేకమంది నాయకులు ఆయనతో అడుగులు కదుపుతున్నారు. ఇలా మార్పు కోసం వచ్చిన ప్రతీ నాయకుడిని చెడుగా చిత్రించి పార్టీని మరుగున పడేయాలి అని చూస్తే ఇవి 80 ల్లో రాజకీయాలు కాదు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుక ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యాన్ని కొన్ని అక్కుపక్షులు వచ్చి నిర్వీర్యం చేయాలని చూడటం వారి మూర్ఖత్వానికి నిదర్శనం.Top