ఆంధ్రలో కేసీఆర్ మద్దతుదారులకు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు..!

By Xappie Desk, December 24, 2018 12:02 IST

ఆంధ్రలో కేసీఆర్ మద్దతుదారులకు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు..!

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎవరు ఊహించని విధంగా మెజార్టీ స్థానాలు గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇటీవల ఉమ్మడి గవర్నర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
 
రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఒక పక్క పార్టీ బాధ్యతలను తెలివిగా తన తనయుడు కేటీఆర్కి అప్పగించి జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి సారించడానికి రెడీ అయ్యారు కేసీఆర్. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఇటీవల ఆంధ్ర పర్యటన చేశారు. కెసిఆర్ ఆంధ్ర కి రాబోతున్న క్రమంలో ఆయనకు మద్దతు తెలపడానికి కేసీఆర్ అభిమానులు మరియు కెసిఆర్ అంటే ఇష్టపడే వారు చాలామంది విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకున్నారు.
 
అంతేకాకుండా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి చినముసిడివాడ వరకు బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి సూచన మేరకు చినముసిడివాడలోని శ్రీ శారద పీఠాన్ని సందర్శించిన కేసీఆర్ అక్కడ రాజశ్యామల దైవానికి పూజలు చేశారు.
 
విశాఖపట్నం విమానాశ్రయంలో కేసీఆర్ మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దాంతో కేసీఆర్ ను కలిసే అవకాశం వస్తుందని వారు భావించారు. అయితే, కేసీఆర్ కు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రే తెలంగాణ పోలీసులు ఆశ్రమాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. దానివల్ల రాజకీయ పార్టీల నేతలకు మాత్రమే కాకుండా కేసీఆర్ అభిమానులకు కూడా ఆయనను కలిసే అవకాశం కలగలేదు. దాంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు.Top