గోదావరి జిల్లా లో అదిరిపోయిన జగన్ స్ట్రేటజీ..!

గోదావరి జిల్లా లో అదిరిపోయిన జగన్ స్ట్రేటజీ..!

2014 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పట్లో జరిగిన అన్ని సర్వేలలో ఇంటికి రావడం జరిగింది. దీంతో గోదావరి జిల్లాలలో ఉన్న వైసిపి పార్టీకి చెందిన నాయకులు ఇక మా గెలుపు ఎవరు ఆపలేరని ఓవర్ గా ఆలోచించడంతో ఎన్నికల సమయంలో రెండు గోదావరి జిల్లాలు వైసీపీ పార్టీ కి గట్టి దెబ్బ వేశాయి.

ఈ క్రమంలో రెండు గోదావరి జిల్లాలో సామాజిక పరంగా చూస్తే ఎక్కువగా కాపులు ఉన్న క్రమంలో ఇదే క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో తన మద్దతు టిడిపికి అని తెలపడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోయాయి... కాపు ఓటు బ్యాంకు మొత్తం Tdp కి మద్దతు తెలపడంతో అతి తక్కువ శాతం తో వైసీపీ పార్టీ అధికారానికి దూరమైంది.

ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికలు వస్తున్న క్రమంలో రెండు గోదావరి జిల్లాలలో సామాజిక వర్గాలను బేరీజు వేసుకుని అభ్యర్థుల ఎంపికను చేపడుతున్నారు వైఎస్ జగన్. ఓటు బ్యాంకు కీలక అంశంగా చేసుకుని ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకొని రాబోయే ఎన్నికలలో తన పార్టీ తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపడానికి సరైన స్కెచ్ వేసినట్లు సమాచారం.

ప్రస్తుతమైతే రెండు గోదావరి జిల్లాలలో రాజకీయ సమీకరణాలు గమనిస్తే తెలుగుదేశం పార్టీకి గతంలో ఉన్న ఆదరణ లేనట్లు ఇదే క్రమంలో జనసేన పార్టీ కొద్దిగా బలపడినట్లు పొలిటికల్ స్టాటిస్టిక్స్ తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన మరియు టిడిపి పార్టీలను ఇరుకున పెట్టే విధంగా వైసీపీ రానున్న ఎన్నికల్లో తన పార్టీ తరపున బలమైన అభ్యర్థులను నిలబెట్టబోతున్నట్లు వైసీపీ పార్టీ నుండి వస్తున్న సమాచారం.Top