సోషల్ మీడియాలో మోడీ పై చెలరేగిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు..!

By Xappie Desk, December 24, 2018 12:25 IST

సోషల్ మీడియాలో మోడీ పై చెలరేగిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు..!

గత నాలుగు సంవత్సరాలు బిజెపి పార్టీ తో కలిసి పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేసిందని.. విభజన హామీల లో ఏదీ కూడా నెరవేర్చలేదని మీడియా ముందు తెగ గగ్గోలు పెడుతున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాలో కూడా ఉపయోగించుకుని మోడీపై సంచలన వ్యాఖ్యలు ఇటీవల చేశారు చంద్రబాబు.

ఈ క్రమంలో త్వరలో ఏపీ లో మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో.. మోడీ యొక్క ఈ పర్యటనను ఉద్దేశించి ఒక సంచలన ట్వీట్ పెట్టారు. "ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడకు వస్తామంటున్నారు. ఎందుకు వస్తున్నారు? మేము బతికామా చచ్చామా చూడ్డానికి వస్తున్నారా? మా పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన మీరు ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తామంటున్నారు?" అని ట్వీట్ పెట్టారు. మోడీ మీద ఈ స్థాయిలో విరుచుకు పడేలా ట్వీట్ పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత వరకు నమ్ముతారో వేచి చూడాలి.

ఇదే క్రమంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీలో పర్యటన సమయంలో ఇలానే మీడియా ముందు వ్యాఖ్యానించారు చంద్రబాబు. పుండు చేసి దానిపై కారం జల్లడానిక... ఏపీ రాహుల్ పర్యటన అంటూ కామెంట్లు చేసిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తో చేతులు కలిపారు. ఈ క్రమంలో త్వరలో ఏపీ కి రానున్న మోడీపై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు రానున్న రోజుల్లో ఏ విధంగా వ్యవహరిస్తారో అని ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.Top