పాదయాత్ర లో పవన్ కళ్యాణ్ పై మరింత స్వరం పెంచిన జగన్..!

పాదయాత్ర లో పవన్ కళ్యాణ్ పై మరింత స్వరం పెంచిన జగన్..!

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్ర చివరి దశకు చేరుకుంటున్న క్రమంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న సామాన్యులకు అర్థమయ్యే రీతిలో 2014 లో విభజన జరిగిన నాటి నుండి ప్రస్తుతం వరకు ఏపీ లో జరిగిన అన్ని విషయాలను రాష్ట్రంలో ఉన్న సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో పూసగుచ్చినట్లు చెప్పుకుంటూ ప్రత్యర్థులకు దడ పుట్టించే విధంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్.

ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో యాత్ర చేస్తున్న జగన్ అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో మోడీ నుంచి పవన్ వరకు ఎవరిని వదిలి పెట్టలేదు. బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు చంద్రబాబు మోడీ అనే కొత్త యాక్టర్ ని తీసుకొచ్చి మోసం చేసారని ఇప్పుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చారని ఇద్దరికీ పెద్ద తేడా లేదని బాబు యొక్క స్క్రిప్ట్ లో యాక్టర్లు మాత్రమే మారారని కానీ స్క్రిప్ట్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదని మండిపడ్డారు.

అదే సందర్భంలో వచ్చే ఎన్నికల్లో మాత్రం ముందునుండి రాష్ట్ర ప్రజల కోసం శ్రేయస్సుకోసం పాటుపడుతున్న వైసిపి పార్టీని ఆదరించాలని కోరారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని అసలు నమ్మొద్దని సంచలన వ్యాఖ్యలు చేసారు.ఎందుకంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీల లీడర్లు చంద్రబాబు మరియు మోడీలతో కలిసి ప్రచారం చేసి వారిని నిలదీస్తా అని చెప్పి ఆంధ్ర ప్రజలని నట్టేట ముంచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అందుకే పవన్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని జగన్ వ్యాఖ్యానించారు.Top