తెలంగాణలో టీడీపీకి దిమ్మతిరిగిపోయే దెబ్బ వేసిన సొంత పార్టీ నేతలు..!

By Xappie Desk, December 24, 2018 12:35 IST

తెలంగాణలో టీడీపీకి దిమ్మతిరిగిపోయే దెబ్బ వేసిన సొంత పార్టీ నేతలు..!

తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కి ఊహించని దెబ్బ తగిలింది. ఎలాగైనా కేసీఆర్ ని ఓడించాలని కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మహా కూటమిని ఏర్పాటు చేసి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఏపీ సీఎం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ ప్రజల ఇచ్చిన తీర్పుతో కంగుతిన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి తెలంగాణ సొంత పార్టీ నేతలు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇంతకి విషయం ఏమిటంటే తెలంగాణ‌లో మొత్తం 12 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ రెండు స్థానాల్లోనే విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. వారిలో ఒక‌రు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య కాగా.. మ‌రొక‌రు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. అయితే ఇప్పుడు ఈ ఇద్ద‌రు నేత‌లు టీఆర్ఎస్‌లోకి వెళ్ళేందుకు సిద్ధ‌మ‌య్యారని స‌మాచారం. ఇప్ప‌టికే టీఆర్ఎస్ నుండి ఈ ఇద్ద‌రికి ఆహ్వానం వ‌చ్చిన మేర‌కు త‌మ అనుచ‌రుల‌తో క‌లిసి చర్చించార‌ని.. ఇక తెలంగాణ‌లో టీడీపీకి భ‌విష్య‌త్తు లేద‌ని, ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని తెలుస్తోంది. దీంతో ఆ ఇద్ద‌రు ఎమ్మ‌ల్యేలు త్వ‌ర‌లోనే టీఆర్ఎస్‌లో చేరడం ఖాయ‌మ‌ని రాజకీయ‌వ‌ర్గాల్లో టాక్ వినపడుతోంది.Top