దారుణమైన కథనాలు ప్రసారం చేస్తున్న టిడిపి మద్దతు మీడియా..!

By Xappie Desk, December 24, 2018 12:41 IST

దారుణమైన కథనాలు ప్రసారం చేస్తున్న టిడిపి మద్దతు మీడియా..!

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే ఎల్లో మీడియా మరింత రెచ్చిపోయే కథనాలు ప్రసారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రెడీ అయిపోయింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకునె పరిస్థితులు రావడంతో... ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే మీడియా వైసీపీ అధినేత జగన్ పై మరియు జనసేన అధినేత పవన్ గురించి విష ప్రచారం చేయడానికి రెడీ అయిపోయింది.

ఈ క్రమంలో జగన్ మరియు పవన్ లు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చెయ్యట్లేదు అని వారు ఎప్పుడో తేల్చి చెప్పేసారు. అయినా సరే వారు ఇంకా కలిసే ఉన్నారు, రహస్యంగా పొత్తులు జరుపుకుంటున్నారని తెలుగుదేశం క్యాడర్ విష ప్రచారం చేస్తుంటే దానికి వత్తాసు పలుకుతూ వారు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మరియు పవన్ లను ఓడించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఈ అసత్య వార్తలని కొన్ని చానెళ్లు మాత్రం ఇంకా ప్రజల మీదకి రుద్దాలని ప్రయత్నిస్తున్నారు అని వైసీపీ మరియు జనసేన శ్రేణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జగన్ మరియు పవన్ లు ఇటీవల తాము తలపెట్టిన యాత్రలలో తెలుగుదేశం పార్టీపై మరియు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ మద్దతు గా ఉండే మీడియా చంద్రబాబుని డిఫెన్స్ చేయడానికి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.Top