బాబాయి వద్దు చెల్లెలు ముద్దు అంటున్న జగన్..!

By Xappie Desk, December 25, 2018 19:57 IST

బాబాయి వద్దు చెల్లెలు ముద్దు అంటున్న జగన్..!

ఇంటిపోరు ఇంతింతి కాదయా.. అన్నాడు ఓ కవి. అది ఎవరిదాకా ఎందుకో కానీ, వైసీపీ అధినేత జగన్‌కి బాగా తెలిసి వస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికలకు ముందు సుమారు మూడు వేల కిలోమీటర్లు నడిచి అన్నయ్య జగన్‌ జైలులో ఉంటే పార్టీ ఉనికిని కాపాడిన షర్మిలకు సీటు ఇవ్వలేదు వైసీపీ. దీంతో ఆమె జగన్‌పై గుర్రుగా ఉన్నారు. ఓ దశలో ఆమె టీడీపీలో చేరుతుందని, కొందరు ఆమెకు రాజ్యసభ బెర్త్‌ కన్‌ఫమ్‌ అయిందని ప్రచారం చేశారు. అంతగా తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన షర్మిల ఈ నిర్ణయం తీసుకుందనే రూమర్‌ వినిపించింది.
 
అయితే, తాజాగా ఆమెను కూల్‌ చేయడానికి తన పరువు, పార్టీ పరువు బజారుకి ఎక్కకుండా చూసుకోవడానికి జగన్‌. షర్మిలకు లోక్‌సభకు పంపాలని డిసైడ్‌ అయ్యాడట. షర్మిల తనకు కడప ఎంపీ స్థానం కావాలని డిమాండ్‌ చేసినా.. ఆమె బాబాయ్‌ వైఎస్‌ వివేకానంద రెడ్డి నుండి ఒత్తిడి రావడంతో ఆ బెర్త్‌ని ఆయనకే కేటాయించనున్నారట.. ఇటు, ప్రస్తుతం కడప సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అవినాష్‌ రెడ్డికి శాసనసభ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చాడట జగన్‌.. ఇదంతా ఫ్యామిలీ నుండి వస్తోన్న ఒత్తిళ్ల మేరకు ఇలా సర్దుబాటు చేశారట. అయితే, షర్మిలకు గెలిచే సీటు ఇవ్వాలని భావించిన జగన్‌. తన బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డికి స్పాట్‌ పెట్టాడట. ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుండి వైవీ సుబ్బారెడ్డిని తప్పించి, షర్మిలను రేస్‌లోకి దించుతాడట జగన్‌. ఆయనను పూర్తిగా పార్టీ కార్యకలాపాలకు ఫిక్స్‌ చేయనున్నాడని సమాచారం. ఇలా ఫ్యామిలీ పాలిటిక్స్‌ని కవర్‌ చేసుకుంటున్నాడట వైసీపీ అధినేత.
 
మరోవైపు, గత ఎన్నికలలో తన తల్లి విజయలక్ష్మిని విశాఖ స్థానం నుండి పోటీ చేయించి ఓటమినిమ మూటగట్టుకున్నాడు జగన్‌. తాజాగా ఆమె చెల్లి సోదరిని ఒంగోలు నుండి బరిలోకి దింపుతున్నాడు. అయితే, ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా జిల్లాలో సీనియర్‌ నేత అయిన మాగంటి శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయనున్నాడు. దీంతో, ఒంగోలు ఆమెకు అంత ఈజీకాదనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు జిల్లాకు బాబు చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు షర్మిలకు శాపంగా మారనున్నాయని తెలుస్తోంది. ఇదే నిజమయితే షర్మిలకు కూడా పరాభవం తప్పదేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top