కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటే ఆ రెండు పార్టీలు భయపడిపోతున్నాయి..!

By Xappie Desk, December 26, 2018 10:58 IST

కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటే ఆ రెండు పార్టీలు భయపడిపోతున్నాయి..!

దేశం అభివృద్ధి చెందాలంటే జాతీయ పార్టీలు అయినా కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీలు దేశంలో లేకుండా ఉండాలని ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు కేసీఆర్.

త్వరలో జాతీయ రాజకీయాల్లో అడుగు పెడతానని దేశం మొత్తం పర్యటిస్తానని కూడా ప్రకటన చేశారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఎమ్.పి బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లడాన్న తట్టుకోలేకపోతున్నాయి.. భయపడిపోతున్నాయి కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మోడీకి ప్రయోజనం చేకూర్చేందుకే కేసీఆర్‌ ఫ్రంట్‌ పెట్టారంటూ ఆ రెండు పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.

ప్రాంతీయ పార్టీలకు పట్టం కట్టేందుకు దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ప్రాంతీయ పార్టీలు బలపడాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని తెలిపారు. ఈ విషయం అర్థంగాని చంద్రబాబు, సురవరం, నారాయణ తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలు అయితే నువ్వు.. లేకపోతే నేను అధికారంలో ఉండాలనే విధంగా ప్రవర్తిస్తున్నాయని వినోద్ అన్నారు.Top