ఓట్లు అలా అడిగితే దుర్మార్గం అవుతుంది అని అంటున్న చంద్రబాబు..!

By Xappie Desk, December 26, 2018 11:13 IST

ఓట్లు అలా అడిగితే దుర్మార్గం అవుతుంది అని అంటున్న చంద్రబాబు..!

ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రులు సంతోషంగా ఉన్నారని ఈ నాలుగున్నర ఏళ్లలో ప్రజలు సుఖ సంతోషాలతో గడిపారని ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రాలో సంక్షేమం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో ఆయా ఊర్ల పర్యటనలో కట్టలకొద్దీ పిటిషన్లు వచ్చేవి.

కానీ ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడెవరూ పింఛను కావాలనో, రేషన్‌ కార్డు కావాలనో అడగటం లేదు. ఆరోగ్యం బాగాలేదని, ఆర్థిక సాయం కావాలని, ఉద్యోగం కావాలని మాత్రమే పిటిషన్లు ఇస్తున్నారు. మేం ఇంత చేసిన తర్వాతా ఇంకా ఓట్లు వేసేటప్పుడు కులమో, మతమో, పార్టీనో అని ఆలోచిస్తే దుర్మార్గమవుతుంది. రాజకీయం ప్రజల్లో సాధికారత తెచ్చేందుకే తప్ప కులాన్నో, మతాన్నో ఉద్ధరించడానికి కాదుని ఆయన అన్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించామని , నాలుగున్నరేళ్లలో సంక్షేమంపైనే రూ.లక్ష కోట్లకుపైగా వెచ్చించామని తెలిపారు.Top