జాతీయ రాజకీయాల్లో సంచలన ప్లాన్ వేసిన మాయావతి..!

జాతీయ రాజకీయాల్లో సంచలన ప్లాన్ వేసిన మాయావతి..!

బిఎస్పి అధ్యక్షురాలు మాయావతిపై ఆ పార్టీకి చెందిన ఒక నేత సంచలన వ్యాఖ్యలు చేశారు జాతీయ మీడియాతో. జాతీయస్థాయిలో తమ పార్టీ అధ్యక్షురాలు యూపీఏ లో గాని ఎన్డీయే కూటమిలో గాని చేరదని తేల్చేశారు. మాయావతి ఎన్డీఏ, యూపీఏ కూటమిలో చేరకుండా మూడో కూటమి ఏర్పాటు వైపే ఆసక్తి కనబర్చుతున్నారని ఆయన వెల్లడించారు.

త్వరలోనే ఉత్తరప్రదేశ్ కు సంబందించి బీఎస్పీ-ఎస్పీ పొత్తు అంశం గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.మూడో ప్రంట్ తరపున మాయావతి ప్రదాని అభ్యర్ధి అని ప్రతిపాదించడానికి సమాజవాది పార్టీతో పాటు ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌, జనతా ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ (జేసీసీ)లు నిర్ణయం తీసుకున్నాయని ఆ నేత తెలిపారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో పాటు పలువురు నేతలతో బీఎస్పీ చర్చలు జరపనుందని ఆయన వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రంట్ తో కలుస్తారా?లేదా అన్నది చూడాలి.Top