ఏపీలో సంచలనం రేపుతున్న జాతీయ మీడియా సర్వే..!

By Xappie Desk, December 26, 2018 11:49 IST

ఏపీలో సంచలనం రేపుతున్న జాతీయ మీడియా సర్వే..!

ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న క్రమంలో సర్వేల గోల మొదలయ్యింది. ప్రస్తుతం ఏపీ లో ఉన్న రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే అధికార పార్టీ తెలుగుదేశానికి మరియు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి కి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది మొన్నటి వరకు. ఈ క్రమంలో తాజాగా ఇటీవల రాష్ట్రంలో ఓ జాతీయ మీడియా నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రిపబ్లిక్ టీవీ అనే జాతీయ మీడియా ఇటీవల ఆంధ్రరాష్ట్రంలో ఆగస్టు నెల నుండి సర్వే చేయగా ఆ సర్వేలో టీడీపీకి 8 లోక్‌స‌భ స్థానాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, వైసీపీకి 14 లోక్‌స‌భ స్థానాలు, కాంగ్రెస్‌కు 3 లోక్‌స‌భ స్థానాలు వ‌స్తాయ‌ని తేల్చేసింది. ఇక మొత్తం ఓట్ల శాతం ఎలా ఉందంటే.. టీడీపీ-కాంగ్రెస్ కూట‌మికి(ఏపీలో కూడా క‌లిస్తే) 38.2 శాతం, వైసీపీకి 41.6 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే తెలిపింది.

ఇక బీజేపీకి 11 శాతం, ఇత‌రుల‌కు 9.3 శాతం ఓట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే తేల్చేసింది. మరోపక్క తాజాగా వచ్చిన స‌ర్వే రిపోర్ట్స్ ప్ర‌కారం చూస్తే.. వైసీపీదే విజ‌యం అని తేలినా.. టీడీపీకి 8 ఎంపీ స్థానాలు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌తో పొత్తుకుంటే.. రెండు, మూడు స్థానాల్లో కూడా గెలిచే అవ‌కాశం లేద‌ని, వైసీపీ దాదాపు 20 ఎంపీ స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.Top