ఏపీ పర్యటనలో ఆంధ్రులకు స్వీట్ న్యూస్ చెప్పబోతున్న మోడీ..!

ఏపీ పర్యటనలో ఆంధ్రులకు స్వీట్ న్యూస్ చెప్పబోతున్న మోడీ..!

ఇటీవల ఆంధ్ర బిజెపి పార్టీకి సంబంధించిన నాయకుడు త్వరలో ఏపీ లో ప్రధాని మోడీ పర్యటన ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బిజెపి నాయకులు మాట్లాడుతూ టిడిపి పార్టీ కేంద్రం పై అనవసరమైన ఆరోపణలు చేస్తుందని అసలు ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది అన్న విషయంపై మోడీ ఈ పర్యటనలో స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో చంద్రబాబు మోడీ పై చేస్తున్న అనవసరమైన ఆరోపణలకు గట్టి కౌంటర్ మోడీ ఇవ్వనున్నట్లు బిజెపి పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం.

మరియు అదే విధంగా కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలపడం పై కూడా మోడీ తన పర్యటనలో ప్రస్తావించనున్నట్లు.. ప్రత్యేక హోదా మరియు ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపై ఆంధ్ర ప్రజలకు ప్రధాని మోడీ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మోడీ తన పర్యటనలో చంద్రబాబును టార్గెట్ చేయనున్నారని సమాచారం. ఈ విషయం పక్కన పెడితే నరేంద్ర మోడీ ఏపీకి ఓ శుభవార్త కూడా మోసుకు వచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. గుంటూరులో నిర్వహించనున్న సభకు వస్తున్న మోడీ ఏపీ ప్రజలకు తీపి కబురును చెప్పనున్నారా? అంటే అవుననే అంటున్నారు అక్కడి బీజేపీ కార్యకర్తలు. ప్రధాని మోడీ ఏపీ కి ఎలాంటి వరాలు ప్రసాదించనున్నాడో చూద్దాం.Top