టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కి షాక్ ఇచ్చిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్..!

By Xappie Desk, December 26, 2018 12:08 IST

టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కి షాక్ ఇచ్చిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్..!

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని పూనుకున్న టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నీ కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఏ విధంగా వెళ్లాలి వంటి విషయాలపై నవీన్ పట్నాయక్ తో చర్చించారు మరియు అదే విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా కలిశారు కేసీఆర్. అయితే తాజాగా ఇటీవల తనను కలిసిన కెసిఆర్ కి తమదైన శైలిలో ఝలక్ ఇచ్చారు ఒడిషా మంత్రి నవీన్ పట్నాయక్. కేసీఆర్ నవీన్ పట్నాయక్ ను కలిసిన మరుసటి రోజే ఒడిషా రాష్ట్ర ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడను కలిశారు. తాజా రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు.

మహిళా రిజర్వేషన్లు, ఈవీఎం మిషన్లు, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై ఇరు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. చంద్రబాబు ఆరోపణలకు ఒడిసా సీఎం మద్దతు ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలన్న చంద్రబాబు నిర్ణయానికి ఎంపీ సౌమ్యా రంజన్ రాయ్ మద్దతు పలికారు.

ఇదే క్రమంలో దేశంలో బీజేపీ పాలన పై కూడా ఇరువురు చర్చించుకున్నారు..రానున్న రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉండాలంటే బీజేపీయేతర కూటమి ఏర్పడాలని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు చర్చించుకున్నారు. దీంతో తాజాగా వీరిద్దరి బేటి జాతీయ రాజకీయాలలో మరియు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది.Top