ఆసక్తి రేపుతున్న పవన్ కళ్యాణ్ యూరప్ పర్యటన..!

By Xappie Desk, December 26, 2018 21:16 IST

ఆసక్తి రేపుతున్న పవన్ కళ్యాణ్ యూరప్ పర్యటన..!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల కుటుంబ సమేతంగా యూరప్ కి వెళ్లారు. దీంతో పవన్ కళ్యాణ్ యూరప్ పర్యటన పై సోషల్ మీడియా తో పాటు ఇంకా అనేక ఛానళ్లలో ఇష్టమొచ్చినట్లు కథనాలు ప్రసారం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ లో పవన్ యూరప్ పర్యటన ఆద్యంతం అందరినీ ఆసక్తి రేపుతోంది. ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ యూరప్ ట్రిప్ తన కుటుంబం కోసం వెళ్లారని తెలిసింది. పవన్ అన్నా లెజోనోవాల కుమారుడు శంకర పవనోవిచ్‌కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయవలసిన కొన్ని లాంఛనాలను పూర్తి చేసేందుకు యూరప్ వెళ్లారని సమాచారం. కార్యక్రమాలు పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ యూరప్ లోనే క్రిస్ట్‌మస్ వేడుకల్లో పాల్గొంటారని తెలిసింది. రెండు రోజుల్లో యూరప్ పర్యటన అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్‌ చేరుకుంటారు.

ఈ క్రమంలో ఇటీవల జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించిన సోదరుడు నాగబాబు మరియు హీరో వరుణ్ తేజ్ ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పనున్నట్లు ఇటీవల తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా త్వరలో ఆంధ్రలో ఎన్నికలు వస్తున్న క్రమంలో ఎక్కువ సమయం విజయవాడ ప్రాంతంలోనే పార్టీ ఆఫీస్ లోనే అందరికి అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.Top