జనసేన పార్టీకి ఏదైనా చేయాలని ఉంది అంటూ మనసులో మాట బయటపెట్టిన నాగబాబు..!

జనసేన పార్టీకి ఏదైనా చేయాలని ఉంది అంటూ మనసులో మాట బయటపెట్టిన నాగబాబు..!

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇటీవల ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించడాన్ని అభినందించారు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్న వాటినన్నిటిని వదిలేసి ప్రజల కోసం తన తమ్ముడి చేస్తున్న పోరాటాన్ని చూస్తుంటే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఏదో ఒకటి తన తరఫున తన కుటుంబం తరఫున చేయాలని ఎప్పటి నుండో వుందని పేర్కొన్నారు. సమాజం కోసం కోట్లను వదులుకొని కుటుంబాన్ని పక్కనపెట్టి పోరాడుతున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అన్నగా ఉండటం సంతోషంగా ఉందన్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీకి ఇచ్చిన విరాళాల గురించి ప్రస్తావిస్తూ.. పవన్ చేస్తున్న పోరాటంలో ఇలా విరాళం ద్వారా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కుటుంబ సభ్యులం ఏమీ చెయ్యలేకపోతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీకి తాము ఇంకా సేవ చేస్తామని మా సహాయం మరింతగా ఉంటుందని నాగబాబు హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలని తపనపడే పవన్ ఆశయం నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు నాగబాబు తెలిపారు. ఆఖరున గాజు గ్లాస్ లో టీ తాగుతూ ఈ గ్లాస్ లో టీ తాగితే వచ్చే కిక్కే వేరబ్బా అంటూ డైలాగ్ వేస్తూ పార్టీ సింబల్ ను గుర్తు చేసుకున్నారు.Top