జగన్ కేసుల గురించి చంద్రబాబు...కాంగ్రెస్ తో చేతులు కలిపారు అంటున్న వైసిపి ఎంపి..!

By Xappie Desk, December 27, 2018 10:59 IST

జగన్ కేసుల గురించి చంద్రబాబు...కాంగ్రెస్ తో చేతులు కలిపారు అంటున్న వైసిపి ఎంపి..!

వైసీపీ అధినేత జగన్ పై కేంద్రం అక్రమ కేసులు పెట్టలేదని అందుకే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో జత కలిసి రాజకీయాలు చేస్తున్నారని వైసిపి పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్లో ప్రస్తావించారు.

‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చెప్పింది అక్షర సత్యం. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏదో ఒక నేరం మోపి అరెస్ట్‌ చేయండని కేంద్రంపై ఒత్తిడి చేశారు. రాష్ట్ర సమస్యలు, నిధులపై చర్చ లేదు. వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ అక్రమ కేసులు పెడితే తామెలా చేస్తామని కేంద్రం స్పష్టం చేయడంతో.. చంద్రబాబు కాంగ్రెస్సే నయమని అటువైపు జారిపోయార’ని ట్వీట్‌లో పేర్కొన్నారు.

వైఎస్ జగన్ జైల్లో ఉంటేనే తన రాజకీయ మనుగడ ఉంటుందని తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను చంద్రబాబు గాలికొదిలేశారని దారుణమైన కామెంట్లు చేశారు.Top