కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..!

By Xappie Desk, December 27, 2018 11:09 IST

కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..!

దేశంలో జాతీయ రాజకీయాలలో రాణించాలని తెగ తాపత్రయ పడుతున్న టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ సినీ నటి విజయశాంతి. నేషనల్ పాలిటిక్స్ పేరిట ఫెడరల్ ప్రంట్ అంటూ కెసిఆర్ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

బిజెపి తెరచాటును కెసిఆర్ సహకరించిందని, అందుకు రుణం తీర్చుకోవడానికి కెసిఆర్ ఆరాట పడుతున్నారని ఆమె అన్నారు. మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి తెచ్చేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రధాన పార్టీలు సిద్ధమవుతుంటే.. యూపీఏ బలపడకుండా అడ్డుకునేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విజయశాంతి అన్నారు.

సీఎంలు మమతబెనర్జీ, నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్‌ భేటీ కుట్రలో భాగమేనని విమర్శించారు. కెసిఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా యూపీఏ కూటమి నీ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని రానున్న రోజుల్లో యూపీఏ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు విజయశాంతిTop