హైకోర్టు విభజన తమ వల్లే జరిగిందని అంటున్న టిఆర్ఎస్ పార్టీ నేత..!

By Xappie Desk, December 27, 2018 11:19 IST

హైకోర్టు విభజన తమ వల్లే జరిగిందని అంటున్న టిఆర్ఎస్ పార్టీ నేత..!

విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల కు వేర్వేరుగా హైకోర్టు ఉండాలని విభజన హామీల లో తేల్చిచెప్పింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో హైకోర్టు గురించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలాసార్లు చర్చలు కూడా జరిగాయి.

అయితే ఎట్టకేలకు కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల కు హైకోర్టు విషయమై స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ పోరాట ఫలితంగానే హైకోర్టు విభజన జరిగిందని లోక్ సభలో అన్నారు. ఇందుకోసం ఉద్యమస్పూర్తిని అనుసరించామని వారు చెప్పారు. పోరాడితే తప్ప సాధించలేమన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడుగుజాడల్లోనే తాము నడిచామని అన్నారు.

ఇందుకోసం న్యాయవాదుల కృషిని వారు అబినందించారు. సొంత లాభాలు, పైరవీలు, లావాదేవీల కోసం ఆంధ్రప్రదేశ్‌ నేతలు హైకోర్టు విభజనను అడ్డుకున్నారని జితేందర్‌రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్ పోరాడకుంటే ఉమ్మడి రాజధానిగాహైదరాబాద్‌ను పేర్కొంటూ పదేళ్ల పాటు హైకోర్టు ఏర్పాటులో కేంద్రం జాప్యం చేసేదని వినోద్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.Top