బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయకూడదు అంటున్న యూపీ సర్కార్..!

By Xappie Desk, December 27, 2018 11:23 IST

బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయకూడదు అంటున్న యూపీ సర్కార్..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్వామి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని పట్టణాలకు పేర్లు మారుస్తూ అనేక వివాదాలు ఎదుర్కొంటున్న స్వామి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తాజాగా ముస్లింల నమాజ్ విషయంలో తీసుకున్న నిర్ణయం దేశంలోని సంచలనం సృష్టించింది. ఇంతకి విషయం ఏమిటంటే బహిరంగ ప్రదేశాలలో , ప్రత్యేకించి పార్కులలో ముస్లిం ఉద్యోగులు నమాజ్ చేయకుండా ఉత్తరప్రదేశ్ లోని నొయిడా పోలీసులు ఆదేశాలు ఇచ్చారు.

వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మత సామరస్యం కాపడడానికి వీలుగా ఈ చర్య చేపట్టినట్లు వారు చెబుతున్నారు. నొయిడా సెక్టార్ 58లో కొన్ని కంపెనీల ముస్లిం ఉద్యోగులు సమీపంలోని పార్కులో శుక్రవారం మద్యాహ్నం నమాజ్ చేస్తున్నారట. దీనికి పరిసరాలలో నివసించేవారు అబ్యంతరం చెబుతున్నారని పోలీసులు తెలిపారు. అందువల్ల మసీదులలో, ఈద్ గాలలో, లేదా కంపెనీల లోపల ప్రత్యేక స్థలంలో నమాజ్ చేసుకోవచ్చని, సమీపంలోని పార్కులలో వారు నమాజ్ చేస్తే కంపెనీలు బాద్యత వహించాలని పోలీసులు స్పష్టం చేశారు.

తమ ఉద్యోగులకు ఈ విషయాలు తెలియచేయాలని కూడా పోలీసులు కోరారు. గతంలో పార్కులో పది,పదిహేను మంది ముస్లిం ఉద్యోగులు నమాజ్ చేసేవారట . ఆ సంఖ్య క్రమేపి 500వైగా చేరడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారట.కొందరు దీనిపై కోర్టుకు వెళ్లినా పోలీసుల వాదననే కోర్టు సమర్దించింది.Top