రాయలసీమ వాసుల కల నెరవేర్చబోతున్న చంద్రబాబు..!

By Xappie Desk, December 27, 2018 11:27 IST

రాయలసీమ వాసుల కల నెరవేర్చబోతున్న చంద్రబాబు..!

రాయలసీమ వాసులు తమ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ కోసం ఎప్పటినుండో వేచి ఉంటున్నారు. చాలా ప్రభుత్వాలు సీమ లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులకు ఉపాధి కల్పించాలని ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని గత ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి ఈ క్రమంలో తాజాగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కడప ప్రాంతంలో మైలవరం మండలంలో ఒక్క పరిశ్రమ చేయడానికి రెడీ అయ్యారు.

ఈ పరిశ్రమ దాదాపు మూడు వేల ఎకరాల్లో ఉక్కు ప్లాంట్ ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. 20 వేల కోట్ల వ్యయంతో నిర్మితం కానున్న ఈ ఫ్యాక్టరీ ద్వారా 10 వేల మందికి ఉపాధి దొరకనుంది. దీంతో సీమ జిల్లాల్లో నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరనుంది. విభజన హామీల్లో ఒకటైన ఈ ప్లాంటును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం దక్కలేదు.

కేంద్రం ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభ్యుత్వమే సొంత ఖర్చుతో ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో బాబు కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించి తీరుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఈరోజు తొలి అడుగు వేశామని పేర్కొన్నారు చంద్రబాబు. దీంతో రాయలసీమ వాసుల కల చంద్రబాబు నెరవేర్చుతున్నారు అని అంటున్నారు చాలామంది సీనియర్ రాజకీయ నేతలు.Top