‘మావాడు’ అంటూనే జగన్ గాలి తీసేసిన జెసి దివాకర్ రెడ్డి..!

By Xappie Desk, December 27, 2018 11:31 IST

‘మావాడు’ అంటూనే జగన్ గాలి తీసేసిన జెసి దివాకర్ రెడ్డి..!

అనంతపురం జిల్లా టిడిపి నాయకుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ధర్మ పోరాట దీక్షలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘మావాడు’ జగన్ కాస్త పొగరు ఉన్న వ్యక్తి వాళ్ల నాయన వైయస్సార్ లా కాకుండా తిక్కతిక్కగా వ్యవహరిస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుషులకు మర్యాద ఇవ్వకుండా.. లెక్కచేయని రాజకీయ నేత ఎప్పటికీ సీఎం అవ్వలేడు అని.. జగన్ సీఎం అవటం కష్టమని..నిజంగా జగన్ కి ముందు చూపు ఉంటే ఈ రాష్ట్రానికి ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడని జేసీ అన్నారు.

జగన్ కు కాస్త తిక్క ఎక్కువుందని,కుల పిచ్చి ఉందని అన్నారు. రాష్ట్రంలో కేవలం ఆరు, ఏడు శాతానికి పరిమితమైన రెడ్డి సామాజికవర్గాన్ని నమ్ముకొని సీఎం కావాలని అనుకుంటున్నాడని అది జరగని పని అని అన్నారు, చంద్రబాబు సామజిక వర్గం తమకంటే తక్కువ ఉన్నారని, బాబు అన్ని కులాలవారిని కలుపుకుపోయి ముఖ్యమంత్రి అయ్యారని. ప్రధానిగా మోడీ ఎల్లకాలం ఉండాలని కుట్ర జరుగుతుందని, ఆ కుట్ర భగ్నం చేయటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని అన్నారు జేసీ. పోలవరం నిర్మాణంలో రికార్డు స్థాయిలో చొరవ చూపారని ఈ సందర్బంగా చంద్రబాబును జేసీ కొనియాడారు. రానున్న రోజుల్లో మళ్లీ చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు జెసి దివాకర్ రెడ్డి.Top