ఢిల్లీ నుండి చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ తెప్పిస్తున్న కెసిఆర్..?

By Xappie Desk, December 27, 2018 17:21 IST

ఢిల్లీ నుండి చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ తెప్పిస్తున్న కెసిఆర్..?

ఇటీవల తెలంగాణ ఎన్నికలలో గెలిచిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో తనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో పావులు కదిపిన చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇటీవల జాతీయ రాజకీయాలలో కూడా రాణించాలని చాలామంది పలువురు జాతీయ స్థాయిలో ఉన్న నేతలను కలిసిన కేసీఆర్.. ఢిల్లీలో ఉన్న ప్రధాన మోడీ ని కూడా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ లో అనేక అంశాలపై చర్చించిన కేసీఆర్ వీరిద్దరి భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ అంశం కూడా వచ్చినట్లు ఢిల్లీ నుండి వస్తున్న సమాచారం.

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేయడం - తెలుగుదేశం పార్టీని ఓడించడం వంటి అంశాలపై కొంతసేపు చర్చించినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అటు భారతీయ జనతా పార్టీకి - ఇటు తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా ఉమ్మడి శత్రువు కావడంతో ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడికి సంయుక్తంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన చర్చల్లో తెలుగుదేశం పార్టీ - చంద్రబాబు నాయుడి గురించే ఎక్కువ సమయం వెచ్చించినట్లు తెగ వార్తలు వినబడుతున్నాయి. మొత్తంమీద టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కి ఢిల్లీ నుండి స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.Top