కడప ఫ్యాక్టరీ గురించి చంద్రబాబు కి షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

By Xappie Desk, December 28, 2018 11:32 IST

కడప ఫ్యాక్టరీ గురించి చంద్రబాబు కి షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల లో ప్రధాని హామీ.. రాయలసీమ వాసుల కల అయినా కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ విషయంలో కేంద్రం ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చంద్రబాబు చొరవ తీసుకుని రాష్ట్రం నిధులతో నిర్మాణం చేపడతామని రాయలసీమ వాసులకు తెలియజేశారు. దీంతో బాబు తెలియజేసిన మాటలకు కేంద్ర ప్రభుత్వంపై రాయలసీమ వాసులు ఎంతగానో అసహ్య పడుతున్నారు.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు పన్నిన పన్నాగం పసిగట్టి ఏపి ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెడుతూ కడప ఉక్కు ప్యాక్టరీపై సంచలన ప్రకటన చేసింది. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తమకు అందించలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ప్రకటించింది. ముడి పదార్ధాల లభ్యత, గనులకు సంబంధించిన ఉన్నత స్థాయి టాస్కో పోర్స్ ఏర్పాటు చేసినట్లు కేంద్రం గుర్తుచేసింది. దీని ద్వారా ఎన్నిసార్లు వివరాలు కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన లేకుండా పోయిందని వెల్లడించింది.

మరో వైపు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడదని సెయిల్‌ నివేదిక ఇచ్చిందని ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. సాద్యాసాధ్యాలను పరిశీలిస్తుండగానే ఏపి సీఎం అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు ఫ్యాక్టరీని చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం సమస్యగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీర్చి ఉన్నారని పరోక్షంగా అభిప్రాయపడుతున్నారు.Top