కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై సెటైర్లు వేసిన చంద్రబాబు..!

By Xappie Desk, December 28, 2018 11:41 IST

కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై సెటైర్లు వేసిన చంద్రబాబు..!

తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసిఆర్ ఎక్కువ జాతీయ రాజకీయాలపైన దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒడిశా సీఎం ని అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కలిసి ఎవరు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ మరియు బి.జె.పి రహిత కూటమి ఏర్పడితే దేశం అభివృద్ధి చెందుతుందని కెసిఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రయత్నాలపై మరియు ఆయన రాణించాలని చూస్తున్న జాతీయ రాజకీయాలపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఇటీవల అమరావతిలో మీడియా తో మాట్లాడుతున్న చంద్రబాబు.. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా లేదా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్‌‌లు ఉంటాయన్నారు. మరో ఫ్రంట్ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాక్టీకల్‌గా మాట్లాడాలని ఆయన సూచించారు. మాయావతిలు కూడ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే వారంతా కాంగ్రెస్ ఫ్రంట్‌లో చేరాలని బాబు కోరారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాడాలని పరోక్షంగా కెసిఆర్ కి సూచించారు చంద్రబాబు.< /p>Top