మరికొద్ది రోజుల్లో పాదయాత్ర ఆపేస్తున్న జగన్..!

By Xappie Desk, December 28, 2018 11:49 IST

మరికొద్ది రోజుల్లో పాదయాత్ర ఆపేస్తున్న జగన్..!

ప్రజా సంకల్ప పాదయాత్ర పేరిట వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన పాదయాత్ర ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న జగన్ పాదయాత్రను ఇంకా కొనసాగిస్తూ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వారి బాధలు వింటూ వారిని ఓదారుస్తూ భరోసా ఇస్తూ ధైర్యం చెబుతూ ముందుకు అడుగులు వేస్తున్నారు జగన్. ఇదిలా ఉండగా 2019లో ఎన్నికలు రానున్న క్రమంలో ఫిబ్రవరి 9వ తేదీ నాటికి పాదయాత్ర పూర్తి చేయాలని.. పాదయాత్ర పూర్తి కాగానే జగన్ ఎన్నికల వ్యవహరాల్లో బిజీగా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్ర అయిన వెంటనే బస్సు యాత్ర ఉంటుందని ఇప్పటికే పార్టీ నుండి వస్తున్న సమాచారం.

అయితే ఒక్కసారి రాజకీయాలలో పాదయాత్ర సెంటిమెంట్ గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు వైయస్ మరియు చంద్రబాబు పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు విభజన తరువాత మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తారో రారో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. మొత్తంమీద జగన్ భవిష్యత్తు నాలుగు నెలల్లో తేలనుంది.Top